calender_icon.png 5 November, 2025 | 7:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్యంత వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

05-11-2025 05:31:57 PM

ఘట్ కేసర్ (విజయక్రాంతి): పోచారం, ఘట్ కేసర్ మున్సిపల్స్ ప్రాంతాల ప్రజలు కార్తీక పౌర్ణమి వేడుకలను బుధవారం అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా ప్రజలు దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోచారంలోని శ్రీసర్వమంగళ సమేత స్పటికలింగేశ్వస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్బంగా దీపారాధన, ద్వాదశ జ్యోటిర్లింగాలకు భక్తులు అభిషేకాలు జరిపారు. సాయంత్రం వేళ మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయాల వద్దకు చేరుకొని కార్తీక దీపాలను వెలిగించారు. అలాగే తమ గృహాల వద్ద కార్తీక దీపాలు వెలిగించారు. భక్తులు కుటుంబ సభ్యులతో ఆలయాలకు చేరుకోవడంతో ఆలయ ప్రాంగణాలు కిటకిటలాడాయి.