calender_icon.png 5 November, 2025 | 8:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం అంటే కటింగ్ మినిస్టర్ కాదు.. చీఫ్ మినిస్టర్

05-11-2025 05:34:16 PM

హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రగతి నివేదికను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనపై ఎక్కడైనా చర్చకు సిధ్దమన్నారు. చెత్త ఎవరిదో.. సత్తా ఎవరిదో తేల్చుకుందాం.. చర్చకు రావాలని డిమాండ్ చేశారు. గత పదేళ్లలో హైదరాబాద్ కు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో, రెండున్నర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు సిద్ధమా..? అని అడిగారు. కమాండ్ కంట్రోల్ సెంటర్, జూబ్లీహిల్స్ నివాసం, గాంధీభవన్, అసెంబ్లీ.. ఎక్కడైనా చర్చించుకుందామంటూ సీఎంకు కేటీఆర్ సవాల్ చేశారు. 

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో మంగళవారం ముఖ్యమంత్రి ప్రచార సభల్లో కేటీఆర్ పైన చేసిన వ్యాఖ్యాలు నిరాశానిస్పృహలకు సంకేతం అంటూ విరుచుకుపడ్డారు. తనను వ్యక్తిగతంగా విమర్శించినా.. రాష్ణ్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని గౌరవిస్తామన్నారు. రెండేళ్లలో ఒక్క ఫ్లైఓవర్.. ఒక్క కొత్త రోడ్డు అయినా వేశారా..? అని నిలదీశారు. సీఎం అంటే కటింగ్ మినిస్టర్ కాదు.. చీఫ్ మినిస్టర్ అని కేటీఆర్ మండిపడ్డారు. పురపాలక, హోంశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి పూర్తిగా వైఫల్యం చెందారని ఆరోపించారు. 

ఈ సందర్భంగా బీఆర్ఎస్ హయాంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రగతి నివేదికను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ విడుదల చేశారు. కాంగ్రెస్ లేకుంటే ముస్లీంలు లేరని రేవంత్ రెడ్డి చెప్పడం సరికాదన్నారు. కాంగ్రెస్ పుట్టక ముందే దేశంలో ముస్లీంలు, బీజేపీ పుట్టక ముందునుంచే హిందువులు ఉన్నారని ఆయన తెలిపారు.  ఒక మతాన్ని అవమానించిన రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.