06-08-2025 12:27:51 AM
రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్‌ను తాము వదలబోమన్నట్లుగా కొద్ది రోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనా ల్డ్ ట్రంప్ సుంకాల రంకెలు వేస్తున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపాలని తను చెప్పిన మాటను పుతిన్ పెడచెవిన పెట్టారని ట్రంప్ ఉక్రోశం. కనుక రష్యా నుంచి చమురు, ఆయుధాలు దిగుమతి చేసుకోకూడదని ట్రంప్ భారత్‌పై ఒత్తిడి తెస్తున్నారు. భారత్‌పై ఇప్పటికీ 25 శాతం సుంకాలు, అదనంగా పెనాల్టీ విధిస్తామని ప్రకటించిన ట్రంప్, భారత్ మౌనాన్ని సహిం చలేక సుంకాలను ఇంకా పెంచుతామని ప్రకటించారు.
రష్యా నుంచి తక్కువ ధరకే చమురు కొనుగోలు చేస్తున్న భారత్, దానిలో కొంత భాగం బహిరంగ విపణిలో అమ్మి సొమ్ముచేసుకుంటున్నదని కూడా ట్రంప్ నిందిస్తున్నారు. ట్రంప్ సుంకాలు, పెనాల్టీల గురించి ఎంత గొంతు చించుకు న్నా, దాదాపు వారం రోజులుగా భారత్ మౌనం వహించింది. దేశప్రయోజనాలను ఫణంగా పెట్టి అమెరికా చెప్పినట్టు వాణిజ్య ఒప్పందానికి వెళ్లేది లేదని భారత్ తన వైఖరిని స్పష్టం చేసిందే తప్ప అగ్రరాజ్యాన్ని ఈ విషయంలో తూలనాడలేదు.
కానీ ఇక చూస్తూ ఉండలేమన్నట్లుగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం తీవ్రమైన స్వరంతో ఒక ప్రకటన వి డుదల చేసింది. రష్యా నుంచి మేం చమురు దిగుమతి చేసుకుంటే మీకొచ్చిన బాధేమిటని దాని సారాంశం. అమెరికా, ఐరోపా యూనియన్ ఈ విషయంలో భారత్‌ను పదే పదే విమర్శించడం సమంజసం కాదని తెగేసి చెప్పింది.
మాస్కోలో పశ్చిమ దేశాలు వాణిజ్యం చేస్తూనే, భారత్‌ను నిందించడం రెండు నాల్కల ధోరణిగా పేర్కొంది. నిజానికి రష్యా మధ్య యుద్ధం మొదలయినపుడు అంతకుముందు భారత్‌కు చ మురు సరఫరా చేస్తున్న దేశాలు యూరప్ వైపు వెళ్లాయి. దానితో భారత్, రష్యా నుంచి చమురు దిగుమతి పెంచింది. మార్కెట్ సుస్థిరత కోసం అ ప్పుడు అమెరికా కూడా దీనిని ప్రోత్సహించింది. ఇప్పుడు పరిస్థితులు మారాయి.
రష్యా నుంచి ఎరువులు, ఇనుము, యంత్రాలు తదితరాలను దిగుమతి చేసుకుంటున్న యూరప్ దేశాలు.. అణు పరిశ్రమకు అవసరమైన యురేనియం, హెక్సాఫ్లోరైడ్‌ను, పెల్లాడియమ్‌ను దిగుమతి చేసు కుంటున్న అమెరికా ఒక లక్ష్యంతోనే భారత్‌ను టార్గెట్ చేసుకొన్నాయని అర్థం చేసుకోవచ్చు. తన సుంకాల హెచ్చరికల్ని కాదని భారత్, రష్యా నుం చి చమురు దిగుమతిని కొనసాగించడం ట్రంప్‌కు చిరాకు తెప్పిస్తున్నది.
ఎందుకంటే అమెరికా చమురు ఎగుమతుల్ని ఇబ్బడిముబ్బడిగా పెంచే ప నిలో ఉన్న ట్రంప్ ఇప్పుడు భారత్ మొత్తంగా తన చమురు అవసరాలకు అమెరికా వైపే చూడాలని కోరుకుంటున్నారు. ఇందుకు రష్యా యుద్ధం ఒక సాకు మాత్రమే. బయటికి రష్యాను శత్రువుగా చిత్రిస్తూ.. భా రత్ వాణిజ్య చమురు అవసరాలకు అమెరికా పైనే ఆధారపడాలని ట్రంప్ భావిస్తున్నారు. రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులను ఆపితే భా రత్ పెద్ద మూల్యమే చెల్లించాల్సి వస్తుంది.
అందుకు భారత్ సిద్ధంగా లేదు. అందుకే డొనాల్డ్ ట్రంప్ రోజుకోసారి బెదిరిస్తుంటారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు ఎవరూ బెదిరేది లేదని, ఎవరు ఎవరితో వాణిజ్యం చేయాలనేది మరొకరు చెప్పాల్సిన విషయం కాదని.. రష్యా కూడా ప్రకటన చేసింది. ఇప్పుడు ట్రంప్ భారత్‌కు మరో ౨౪ గంటల టైమిస్తూ చేసిన బెదిరింపు హాస్యాస్పదంగా మారింది.