calender_icon.png 6 August, 2025 | 4:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వరం కమిషన్ పూర్తి నివేదిక బయటపెట్టండి.. చెండాడుతాం

06-08-2025 01:39:02 AM

  1. కేసీఆర్‌ను హింసించడమే వారి లక్ష్యం
  2. బీజేపీ, కాంగ్రెస్‌లవి కక్షసాధింపు చర్యలు
  3. తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యతలేదని సీడబ్ల్యూసీ చెప్పింది
  4. గంధమల్లకు కొబ్బరికాయ ఎట్లా కొడతారు?
  5. ఎన్డీఎస్‌ఏ చైర్మన్ కట్టిన పోలవరం కూలింది!
  6. కాళేశ్వరం కమిషన్ నివేదికపై హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్

హైదరాబాద్, ఆగష్టు 5 (విజయక్రాంతి) : కాళేశ్వరం కమిషన్ పేరుతో వండి వార్చిన నివేదికను ప్రభుత్వం బయటపెట్టిందని మాజీ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. రాజకీయ కక్షసాధింపు కోస మే మొత్తం నివేదికను బయటపెట్టకుండా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. డబ్బులు దండుకునేందుకు కమీషన్లు, ప్రతిపక్షాల మీద కక్షసాధింపు కోసం రాజకీయ కమీషన్లు.. ఇలా రాష్ట్రమంతా కమీషన్ల మయం చేశారని హరీశ్‌రావు మండిపడ్డారు.

కాళేశ్వరం కమిషన్ పూర్తి నివేదికను బయటపెట్టి అసెంబ్లీలో చర్చ పెడితే చీల్చిచెండాడుతామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు ఇచ్చిందని.. ఈ నివేదికే నిజమైతే కేంద్ర ప్రభుత్వాన్ని, అధికారులని తప్పుపట్టినట్లేనని హరీశ్‌రావు తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై ‘కాంగ్రెస్ కుట్రలు వక్రీకరణలు వాస్తవాలు’ అనే అంశంపై మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఒకవైపే చూసి, ఒకవైపే విని, ఒకవైపే నిల్చొని ఇచ్చిన నివేదికలా ఇది కనిపిస్తోందని, ఇదంతా ఒక ట్రాష్ అని ఆయన కొట్టివేశారు. 60 పేజీల రిపోర్టు కాదు.. 

665 పేజీల నివేదిక పెట్టండి చీల్చి చెండాడుతామని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ఎన్నో కమిషన్లు వేశారని, అవి న్యాయస్థానా ల ముందు నిలబడవన్నారు. గతంలోనూ ఎంతోమంది రాజకీయ నేతలపై కమిషన్లు వేశారని, సీఎం రేవంత్ సీరియళ్లు నడు పు తున్నారని అన్నారు.

కేసీఆర్‌ను హిసించడ మే లక్ష్యంగా రాష్ట్రంలో పాలన సాగుతోంద ని, పాలనను గాలికి వదిలేసి డిల్లీ యాత్రలు చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. కాం గ్రెస్, బీజేపీలు కలసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతన్నారయన్నారు.మీడియాకు లీకు లు ఇస్తున్నారని, కుట్రపూరితంగానే కమిషన్ విచారణ జరిగినట్లు కనిపిస్తోందనారు. 

తమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ చెప్పింది

తమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదని సీ డబ్ల్యూసీ చెప్పిందని, అక్కడ 165 టీఎంసీ ల్లో ఎగువ రాష్ట్రాల వాటా ఉందని అన్నారు. మహారాష్ట్ర అభ్యంతరాలు, నీటి లభ్యత లేద ని ఉమాభారతి లేఖలో పేర్కొన్నారని తెలిపా రు. రైతులకు నీళ్లు ఇవ్వాలన్న లక్ష్యం, 11 కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ప్రాజెక్టును ఆమోదించాయని  తెలిపారు.

కమిషన్ ఎవరిని త ప్పు బడుతోంది, అనుమతులు ఇచ్చిన కేం ద్రం, ఏజెన్సీలనా అని ప్రశ్నించారు. ఐదుగు రి నిపుణల కమిటీ కూడా మేడిగడ్డను సూ చించిందని, మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్‌మానేరుకు తరలించలేమని చెప్పారని, వారి అఫిడవిట్‌లో కూడా పేర్కొన్నట్లుగా తెలిపా రు. తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీ సుకున్నట్లు కమిషన్‌కు తెలిపిందన్నారు.

తట్టెడు మట్టి ఎందుకు తీయలేదు?

కాంగ్రెస్ హయాంలో తమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి ఎందుకు తీయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ ఒకేసారి మూడు అగ్రిమెం ట్లు చేశారని, 152 మీటర్లకు ఎలా అగ్రిమెం ట్ చేస్తారని మంత్రి ఉత్తమ్ అన్నారని.. అగ్రిమెంట్ పత్రం తీసుకువస్తే ఇక్కడి నుంచి రా జ్‌భవన్ కి వెళ్లి రాజీనామా చేస్తానని కేసీఆర్ సవాల్ విసిరారని తెలిపారు.

 ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మించిన సర్ ఆర్ధర్ కాటన్ మీద కూడా నాటి బ్రిటీష్ పాలకులు కమిషన్ వేసి 900 ప్రశ్నలతో వేధించారని, చివరకు ఏం చేయలేక పోయారన్నారు. బనకచర్లను తన గురువు చంద్ర బాబు గురుదక్షిణ చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

కాళేశ్వరం కూలిం దన్నోల్లు గంధమల్లకు కొబ్బరికాయ ఎట్లా కొడతారని ప్రశ్నించారు. ఉత్తమ్ సత్యహరిశ్చంద్రుడికి తమ్ముడి లెక్క మాట్లాడుతు న్నారన్నారు. ప్రాణహిత చేవేళ్లలో పెట్టిన ఖర్చు రూ. 3,700 కోట్లు మాత్రమే, రూ.11 వేలకోట్లు ఖర్చు చేశామని ఉత్తమ్ చెప్తున్నారు, మొబలైజేషన్ అడ్వాన్లు పేరు మీద రూ.2వేల కోట్లు దోచుకున్నారని హరీశ్‌రావు ఆరోపించారు.

 అసెంబ్లీలో పవర్ పాయింట్ ఇచ్చిన ఏకైక సీఎం కేసీఆర్

అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఏకైక సీఎం కేసీఆర్ అని, దేశం లో ఏ సీఎం కూడా అసెంబ్లీలో పవర్ పా యింట్ ప్రజెంటేషన్ చేయలేదన్నా రు. కేసీఆర్ కాళేశ్వరంపై అసెంబ్లీలోనే చర్చ పెట్టా రని, మేం ప్రిపేర్ అయి రాలేదని ఉత్తమ్ కుమార్‌రెడ్డి సభ నుంచి పారిపోయారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజేంటెషన్‌లో మిగతా పక్షా లు పాల్గొన్నాయన్నారు.

అసెంబ్లీలో చర్చిచిన తర్వాత కేసీఆర్ సోలో నిర్ణయం ఎలా అవుతుందన్నారు. కేబినెట్ అనుమతే కాద ని, అసెంబ్లీ అప్రూవల్స్ కూడా ఉన్నాయన్నారు. ప్రాణహితకు జాతీయ హోదా ఇ వ్వాలని సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నెలరోజుల్లోనే ప్రధానికి కేసీఆర్ లేఖ రాశారన్నారు. ప్రాణహితకు జాతీయ హోదా అ డగడం తప్పా అని ప్రశ్నించారు.

కొడంగల్ ఎత్తిపోతలకు ఏ అనుమతి ఉందని, సీఎం రేవంత్‌రెడ్డి కొబ్బరికాయ కొట్టిండని, డీపీఆర్ లేకుండానే రేవంత్ రెడ్డి పనులు ప్రారంభించారన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే బిల్లులను కూడా చెల్లించారని ఆరోపించారు. నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్‌కు ఒక్క అనుమతి ఉందో లేదో ఉత్తమ్ చూపించాలన్నారు. 

ఎన్డీఎస్‌ఏ చైర్మన్ కట్టిన పోలవరం కూలింది 

ఎన్డీఎస్‌ఏ సీడబ్ల్యూసీలో అంతర్భాగమని హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రం పిలువకుండానే ఎన్డీఎస్‌ఏ ఎన్నికలకు ముందు మూడు రోజుల్లోనే నివేదకి ఇచ్చిందన్నారు. మూ డుసార్లు కూలిన పోలవరంపై ఎన్డీఎస్‌ఏ  ముందుకు ఎందుకు వెళ్లడం లేదని, పోలవరం కట్టిన ప్రధానిపై చర్య తీసుకుంటావా అని ప్రశ్నించారు. పోలవరం కూలితే ఎగ్జిక్యూటివ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వానిది బాధ్యతనా అని అన్నారు.

ఎన్డీఎస్‌ఏ చైర్మన్ చంద్రశేఖర్ అయ్య ర్ కట్టిన పోలవరం కూలిందని, ఆయన వచ్చి కాళేశ్వరంపై నివేదిక ఇచ్చారన్నారు. రెండు పిల్లర్లు కుంగితేనే కేసీఆర్‌ది బాధ్యత అయితే ఎస్‌ఎల్బీసీ కూలి మృతదేహాలు బయటకు తీయలేదని, ఈ ఘటనలో రేవంత్‌రెడ్డి, ఉత్తమ్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.