calender_icon.png 7 August, 2025 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దశాబ్దాలుగా బీసీలకు ద్రోహం

05-08-2025 12:00:00 AM

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్య్రం పొంది న దేశాలన్నీ దాదాపుగా ఉదారవాద, ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. అవన్నీ రాజ్యాంగతా వాదాన్ని అనుసరిస్తూ వున్నాయి. ప్రతి దేశం ఒక లిఖిత రాజ్యాంగం ఏర్పా టు చేసుకుని, దాని ప్రకారం పాలన కొనసాగిస్తున్నాయి. ఆ దేశాల్లో రాజ్యాంగమే అత్యున్నతం. భారతదేశంలోనూ రాజ్యాం గం ఆధిక్యతను కాపాడుకోవడానికి కోర్టులకు న్యాయ సమీక్షాధికారం ఉంది. అం దుకు సుప్రీం కోర్ట్, హైకోర్టులకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 13, 32, 226 పొందు పరచబడ్డాయి.

ఆధునిక రాజ్యాలు/దేశాలు సార్వభౌమాధికార సిద్ధాంతం ఆధారంగా ప్రజలకు సార్వజనీన వయోజన ఓటు హక్కు, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కల్పించాయి. ఆయా దేశాల్లో ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయాలంటే నిర్ణీత విద్యార్హతలు తప్పనిసరి. విచిత్రమేమంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దేశంలో కేవ లం వయస్సును మాత్రమే ప్రామాణికంగా తీసుకొని, పౌరులందరికీ సమానం గా రాజకీయ హక్కులు కల్పించబడ్డాయి.

కానీ, వాటిని ఉపయోగించుకోవాలంటే ఉండాల్సిన కనీస విద్య/చదువు, సామాజిక, ఆర్థిక సంబంధిత విషయాలకు ఏమాత్రం రాజ్యాంగపరంగా ప్రాధాన్యత లేదు. ఆ విషయాలను రాజ్యాంగ రచన సందర్భంగా కనీసం పరిగణనలోకి కూడా తీసుకోలేదు. దేశంలో నూటికి 95 మంది ఉన్న శూద్రులకు విద్య వేలాది సంవత్సరాల నుంచి దూరంగా ఉంది. ఈ విష యాన్ని పరిగణలోకి తీసుకోకుండా అంద రూ సమానమేనని ప్రభుత్వాలు సమానమైన రాజకీయ హక్కులు కల్పించటం విచారకరం. వినడానికి, చెప్పుకోవడానికి ఈ విషయం చాలా గొప్పగా ఉన్నా, ఆచరణలో పూర్తిగా అగ్ర కులాల వారికే ప్ర యోజనం. ప్రభుత్వాలు అందరం సమానమనే భ్రమల్లో ఉంచడం వల్లే అణచబడిన కులాలు అధికారానికి ఆమడ దూరంలో ఉంటున్నాయి. 

రాజ్యాంగం..  రాజకీయ హక్కులు 

స్వాతంత్రం వచ్చి దాదాపు 8 దశాబ్దా లు కావస్తున్నా, ఇప్పటివరకు రాజ్యాంగ ల క్ష్యాలు తెలువనివారు, రాజ్యాంగాన్ని చూ డని వారు, చదవని వారు, అర్థం చేసుకోనివారు, అర్థమైనా ఆచరించనివారు పార్ల మెంట్, శాసనసభల్లో సభ్యులుగా ఉన్నా రు. ఇదే విషయం అనేక సర్వేల్లో వెల్లడైంది. దీన్నిబట్టి ఇక సామాన్య ఓటర్లు ఎలా ఆలోచిస్తారో ఊహించవచ్చు. హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో ఇ లాంటి వైనాన్ని మనం చూశాం. అయితే రాజ్యాంగం ప్రకారం కల్పించిన రాజకీయ సమానత్వాన్ని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే, ఒక పద్ధతి ప్రకారం ప్రజలను ఒకవై పు అందరం సమానమేనని అనుకునేట ట్టు చేసి, కింది కులాల వారికి ఏదీ అంతకుండా, అసలే అర్థం కాకుండా, తెలివిగా మసిపూసి మారేడుకాయను చేయడం జరిగిందని అనుకోవచ్చు.

ఇప్పటికీ మన రాజ కీయ వ్యవస్థను, రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడం, ఉపయోగించుకోవడం కొం దరికే వీలవుతున్నది. సమన్యాయం, సమతాభావం, సౌభ్రాతృత్వం, అనేవి ఎండ మావులుగానే మిగిలిపోతున్నాయి. ఎంద రో మహానుభావులు సమానత్వం కోసం, మార్పు కోసం కృషి చేసి, సమూల మా ర్పులు తీసుకురావాలని పోరాడారు. వా రంతా ఎంతో కొంత దూరం ప్రయాణిం చి, అలసిపోయి.. చివరకు ఆ పోరాటాన్ని వదిలేశారు. ప్రస్తుత పరిస్థితు ల్లో ఉద్యమా లు చేసే వాళ్లు అధికారంలోకి రావాలంటే, వారి వద్ద సంపదైనా ఉండా లి, లేదంటే కుల బలం, అది కూడా అగ్ర కులమే ఉండాలని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. మరో విషయం ఏమిటంటే.. అగ్ర కులాలకు చెందినవారు రాజ్యాంగంలో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించి, వారి నుంచి తిరుగుబాటు ఆలోచన లేదా పాలకుల పట్ల వ్యతిరేకత అసలే రాకుండా చేయగలిగారు. 

రాజ్యాంగం - రిజర్వేషన్లు..

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలు.. స్వాతంత్రోద్యమంలో తమ పార్టీ పాల్గొన్న విషయాన్ని గొప్పగా ప్రచారం చేసుకున్నారు. నెహ్రూ కుటుంబం ద్వారా సుమారు నలబై ఏళ్ల పాటు నెట్టుకొచ్చారు. ఎప్పుడైతే పాలక అగ్ర కులాల నేతల్లో సంపద కోసం పోటీ పెరిగి, విభజన వచ్చి కొత్త పార్టీలు ఏర్పడ్డాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాజ్యాంగంలోని ప్రాధాన్య విషయాలు ప్రజలకు తెలియజేయాల్సిన పరిస్థితి అనివార్యమైంది. కాబట్టి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు 80వ దశకంలో విస్తృతంగా జనాల్లోకి వచ్చింది. ఎప్పడైతే శూద్ర కులాలకు చెందిన కొందరు రిజర్వేషన్ల వల్ల చదువుకొని, రాజ్యాంగం గురించి తెలుసుకొని, మాట్లాడే పరిస్థితి వచ్చిందో.. అప్పుడు పాలకులు చాలా తెలివిగా రా జ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును తీసుకువచ్చారు. దీంతో ఎస్సీలు సంతృప్తి చెంది, దేశమంతటా అంబేద్కర్ విగ్రహాలు స్థాపించి, ఆయన జయంతి, వర్ధంతికి సభలు పెట్టడం ప్రారంభించారు.

సంతోషంగా సంబురాలు చేసుకుంటూ, ఆనంద డోలికల్లో మునిగి తేలడం ప్రారంభించారు. విచిత్రమైన విషయం ఏమి టంటే బీఆర్ అంబేద్కర్ ఆశించిన కుల నిర్మూలనకు రిజర్వేషన్లను ఒక తాత్కాలిక మెట్టు లాగా పది సంవత్సరాల పాటు ప్రతిపాదిస్తే, దానిని పొడిగించుకుంటూ అగ్ర కుల పాలకులు దీర్ఘకాలిక వ్యవస్థగా మార్చారు. తద్వారా రాజకీయంగా పబ్బం గడుపుకొంటున్నారు. అంబేద్కర్‌వాదులు మాత్రం కుల నిర్మూలన విషయాన్ని తుం గలో తొక్కి.. ఇప్పుడు రిజర్వేషన్లు ఉండాలని గట్టిగా వాదిస్తున్నారు. పైగా కులని ర్మూలన అసలే సాధ్యం కాదని అంటున్నారు. ఆ విధంగా కుల నిర్మూలనకు పరిష్కారం లేదని ఆ వర్గాలతోనే అగ్ర కులాల వారు చెప్పిస్తున్నారు. అందుకే రిజర్వేషన్లకు కాల పరిమితి లేకుండా, రాజ్యాం గ సవరణ తీసుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే అగ్రకుల పాలకుల తెలివితేటలు, ముందు చూపు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 

వెనుకబడిన కులాలపై వివక్ష..

దేశంలో ఎక్కువగా అన్యాయానికి గురైన వారు, రాజ్యాంగపరంగా చిరునామా అయిన లేని వారు, దేశంలోనే ఎక్కువ జనాభా కలిగిన వారు వెనుకబడి బడిన (బీసీలు) వర్గాల వారు. రాజ్యాంగంలోని 340 వ ఆర్టికల్‌లో ‘వెనుకబడిన వర్గాలు/తరగతులు’ అని రాసింది. అలా బీసీలు ద్రోహానికి గురయ్యారు. ఇప్పటికీ ఆ పదానికి అర్థం తెలియక, అర్థం చేసుకునే అవగాహన లేక, బీసీలు ఆగమ వుతున్నారు. కాబట్టి మన దేశంలో వర్గం అనే పదానికి వర్గం/తరగతి అని తెలుగులో అర్థాలు తీసుకుంటే, మరి కులం అర్థం ఏమిటి? దానిని ఎలా భావించాలి? కేవలం బీసీలను మాత్రమే రాజ్యాంగ నిర్మాతలు వర్గమని ఎందుకు సంబోధించాల్సి వస్తుంది. ప్రభుత్వాలు జనాభా లెక్కల్లో ఎస్సీ, ఎస్టీలను లెక్కిస్తున్నారు.

జంతువులను, వృక్షాలను లెక్కిస్తున్నా బీసీలు మాత్రం లెక్కలేని వారిగానే మిగిలారు. ప్రభుత్వాలు బీసీలను లెక్కించక పోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎస్సీ, ఎస్టీలను మినహాయించి మిగతా వారందరినీ ఒకే గాటన కట్టి, మొత్తం ప్రజల్లో వెనుకబడిన తరగతులు ఎవరో నిర్ధారించడానికి ఆర్టికల్ 340 ప్రకారం కేంద్ర ప్రభుత్వం కమీషన్ వేయాలని రాజ్యాంగంలో ఉంది. ఆర్టికల్ ప్రకారం ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వాలు రెండు కమీషన్లు వేసినా, అవి రిపోర్టులు ఇచ్చినా, అనేక రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు చాలా కమీషన్లు వేసినా కూడా, ఏ మాత్రం న్యాయం జరుగక, 2003 వరకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు లేక అన్యాయానికి గురైన, గురవుతున్న ప్రజలే బీసీలు. 

వ్యాసకర్త: బీసీ మేధావుల వేదిక కోర్ కమిటీ సభ్యుడు