calender_icon.png 6 August, 2025 | 9:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెల్త్ కార్డులకు మోక్షమెప్పుడు?

06-08-2025 12:32:32 AM

డాక్టర్ విజయభాస్కర్ :

తెలంగాణ రాష్ర్టంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు నగదురహిత ఆరోగ్య కార్డులు పంపిణీ చేయాలని చాలా రోజుల నుంచి మొరపె ట్టుకుంటున్నా ప్రయోజనం ఉండట్లేదు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. అటువంటి ప్రభుత్వాలే నిమ్మకు నీరెత్తినట్టు వ్య వహరించడం గమనార్హం. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ల హెల్త్ ట్రీట్‌మెంట్ కొరకు రూ. 25 లక్షలిస్తుండగా.. తెలంగాణ టీచర్లకు నిరాశే ఎదురవుతోంది.

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేది ఉద్యోగ, ఉపాధ్యాయులే. వారి ఆరోగ్యంపై ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం బా ధాకరమైన విషయం. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగులకు, పదవీ విరమణ చేసి న ఉద్యోగులకు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు, జర్నలిస్టులకు జారీ చేసిన హెల్త్ కార్డు లు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు,  సూపర్ స్పె షాలిటీ ఆస్పత్రుల్లో ఎక్కడా పని చేయడం లేదు.

అనారోగ్యానికి గురైనప్పుడు ఆస్పత్రులకు వెళ్లి హె ల్త్ కార్డులు చూపిస్తే ఇవి దేనికీ పనికి రావని, డ బ్బులు చెల్లించి వైద్యం చేయించుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఐదు లక్షలు, పది లక్షలు, ఇ రవై లక్షలు ఇంకా అధిక మొత్తాలలో ఎంత డ బ్బు ఖర్చు పెట్టి వైద్యం చేపించినా.. ప్రభుత్వం మాత్రం రెండు లక్షల రూపాయల లోపే రీయింబర్స్‌మెంట్ కింద మంజూరు చేస్తోంది. మంజూ రయినా ఖజానా ఖాళీ అని చెప్పి... ఆ నిధులు కూడా ఇవ్వట్లేదు.

ఉద్యోగ, ఉపాధ్యాయులు, పద వీ విరమణ చేసిన ఉద్యోగులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా లక్షల్లో ఫీజులు కట్టాల్సి వస్తుంది. ఉ ద్యోగ, ఉపాధ్యాయుల దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు లేకపోవడం వల్ల దాచుకున్న బంగారా న్ని అమ్మడం, పర్సనల్ లోన్‌లు తీసుకోవడం, అ ధిక మొత్తాల్లో అప్పులు చేస్తూ.. వైద్యం చేయించుకుంటున్నారు. 

రేపే జీవో అని.. ఏండ్లు చేస్తున్నారు.. 

తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం, గెజిటెడ్ అధికారుల సంఘం సంయుక్త ఆధ్వర్యం లో గత ప్రభుత్వంలో రాష్ర్ట వైద్య శాఖ మంత్రిగా చేసిన హరీశ్‌రావుని కలిసి నగదు రహిత వైద్యాన్ని అందించాలని కోరారు. పీఆర్సీ కమిటీ రికమండేషన్ చేసినట్లు బేసిక్ పే నుంచి ఒక్క శాతం హె ల్త్ స్కీం కింద ఇవ్వడానికి సి ద్ధంగా ఉన్నామని లేకపోతే రెం డు శాతం బేసిక్ పే నుంచి ఇ స్తామని అనగానే పూర్వ వైద్య శాఖ మంత్రి రేపే ప్రైవేట్ ఆస్పత్రులు, సూపర్ స్పెషాలిటీ ఆ స్పత్రులలో హెల్త్ స్కీం కింద ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉ ద్యోగ ఉపాధ్యాయులకు నగదు రహిత వైద్యాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.

హామీ అయితే ఇచ్చారు కానీ.. దాని ఆచరణకు ఏ చర్య తీసుకోలేదు. దాంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా పరిస్థితి తయారైంది. మం త్రి ప్రకటనతో ఆనందపడ్డ వారికి నిరాశే మిగిలిం ది. తెలంగాణ రాక ముందు జారీ చేసిన ఆరోగ్య కార్డులు అనారోగ్య కార్డులుగా మారాయని అం తా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో కాం గ్రెస్ అధికారంలోకి వచ్చి విద్యా, వైద్యానికి ఎక్కు వ ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది.

తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా ఆరోగ్య కార్డులను మంజూరు చేస్తా మని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ర్ట క్యాబినెట్‌లోనూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు, పదవీ విర మణ చేసిన ఉపాధ్యాయులకు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు నగదురహిత ఆరోగ్య కార్డుల జారీపై చర్చించారు.

ప్రభుత్వ ఉద్యోగ, ఉ పాధ్యాయుల ఆరోగ్యాన్ని రక్షించే బాధ్యతను ప్ర భుత్వం గుర్తించడం చాలా ఆనందంగా ఉందని ఉద్యోగ, ఉపాధ్యాయులు సంబురాలు చేసుకున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు వారి వేతనం నుంచి ఒక శాతం కార్పస్ ఫండ్ కింద ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. నగదురహిత ఆరోగ్య కార్డు ల వ్యవహారం మూడు అడుగుల ముందుకు ఆ రు అడుగులు వెనక్కు అన్న విధంగా తయారైంది.

ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులు అది గో నగదురహిత ఆరోగ్య కార్డులు వస్తున్నాయి. ఇదిగో ఆరోగ్య కార్డులు వస్తున్నాయి అని ప్రతి స మావేశంలో అంటున్నారు కానీ అమలు కావడం లేదని ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆవేదనను, ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి హయాంలోని ప్రభుత్వం ఇకనైనా ఉద్యోగ, ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని టీచర్ల కోరిక.

వ్యాసకర్త సెల్: -9290826988