calender_icon.png 9 November, 2025 | 11:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వయనాడ్ ఘటనపై రాజ్యసభలో మాట్లాడిన అమిత్ షా

31-07-2024 03:23:36 PM

కేరళ: వయనాడ్ వరదలో గంట గంటకు మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు కొండచరియలు విరిగిపడిన ఘటనలో 180 మృతిచెందారు. 200 మందికి పైగా బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందగా, కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. అనేక మంది గల్లంతు కాగా, ఘటన స్థలంలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

కేరళ కొండచరియలు విరిగిపడిన ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో బుధవారం మాట్లాడారు. దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని ముందే హెచ్చరించినట్టు అమిత్ షా వెల్లడించారు. కేరళలో గత ఏడేళ్లలో 2,239 మట్టిచరియలు విరిగిపడిన ఘటనలు నమోదయ్యాయని ఎంపీ జాన్ బ్రిటాస్ పేర్కొన్నారు.