27 July, 2026 | 12:23 AM

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆమ్రపాలి

26-06-2024 07:16 PM

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ నూతన కమిషనర్‌గా ఐఏఎస్ ఆఫీసర్ కాట ఆమ్రపాలి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఐఏఎస్‌ల బదిలీల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్‌ను ఇంధన శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఇటీవల రెండు వారాల పాటు సెలవుపై వెళ్లిన రోనాల్డ్ రాస్ స్థానంలో ఇంచార్జ్ కమిషనర్‌గా ఆమ్రపాలి బాధ్యతలు స్వీకరించారు.

రెండు వారాల ముగిసిన తర్వాత జరిగిన బదిలీలలో రోనా ల్డ్ రాస్ స్థానంలో ఆమ్రపాలిని మరోసారి ఎఫ్‌ఏసిగానే నియామకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వ్యులు జారీ చేసింది. దీంతో ఆమె రోనాల్డ్ రాస్ నుంచి బాధ్యతలను స్వీకరించారు. అనంతరం కమిషనర్ ఆమ్రపాలిని పలువురు అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కమిషనర్‌ను కలిసిన వారిలో ఎల్‌బీ నగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ్ చౌహాన్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.