27 July, 2026 | 1:18 AM

రఘునందన్ రావుపై జగ్గారెడ్డి సెటైర్లు

26-06-2024 07:03 PM

హైదరాబాద్ : పార్లమెంట్ సమావేశాలు ముగిశాక కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ని కలిసి హైదరాబాద్ కు ఐటీఐఆర్ తీసురావలని వినతిపత్రం ఇస్తానని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. బుధవారం గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యూపీఏ హయాంలో నగరానికి కేటాయించిన ఐటీఐఆర్ ను మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏప్రిల్ 2016లో పక్కన పెట్టిందన్నారు. మూడు దపాలుగా ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున ఐటీఐఆర్ ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రానికి తీసుకురాలని కేంద్రమంత్రులను కోరుతానని జగ్గారెడ్డి వెల్లడించారు. ఐటీఐఆర్ గురించి తనకేమీ తెలియదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు చేసిన వ్యాక్యలపై జగ్గారెడ్డి స్పందించారు. నేను మీయంత చదువుకోకపోవచ్చు కానీ, జీవితాన్ని చదివాను అంటూ సెటైర్లు చేశారు.