26 July, 2026 | 11:27 PM

మొబైల్ పుడ్ ల్యాబ్స్ సంఖ్య పెంచుతున్నాం : మంత్రి రాజనర్సింహ

26-06-2024 07:41 PM

హైదరాబాద్: తమ డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. బుధవారం  సాయంత్రం వైద్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో జరిగిన చర్చలతో జూడాలు సమ్మెను విరమించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గతంలో రెండుసార్లు స్టైఫండ్ల గురించి మా దృష్టికి తెచ్చారని తెలిపారు. గ్రీన్ ఛానెల్ ద్వారా స్టైఫండ్స్, వసతి గృహాలు ఏర్పాటు చేయాలని, వైద్యులకు రక్షణ కావాలని జూనియర్ డాక్టర్లు ప్రభుత్వాని కోరినట్లు ఆయన వెల్లడించారు.

గురువారం జరిగిన చర్చలో జూనియర్ డాక్టర్ల కోసం రూ.406 కోట్లు విడుదల చేసినట్టు పేర్కొన్నారు. కొత్త భవన నిర్మాణానికి సానుకూలంగా ఉన్నట్టు మంత్రి రాజనర్సింహ చెప్పారు. పేదలకు జిల్లా స్థాయిలోనే మెరుగైన వైద్యం అందించాలని చూస్తున్నామని, ప్రమాణాలతో కూడిన విద్య, మెరుగైన వైద్యం అందించడం తమ బాధ్యత అని ఆయన తెలిపారు. మొబైల్ పుడ్ ల్యాబ్స్ సంఖ్య పెంచుతున్నామని మంత్రి రాజనర్సింహ పేర్కొన్నారు.