ప్రజలను మోసగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
- మాజీ సీఎం కేసీఆర్ బయటకు వస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి భయపడుతున్నారు
జగిత్యాల సభను ఫెయిల్ చేయాలని చూస్తున్నారు
మేడిగడ్డకు వచ్చి ఏం చేస్తారో.. సీఎం ప్రజలకు చెప్పాలి
మూడేళ్ల నుంచి తెలంగాణ ప్రజలు, రైతులను గోసపెట్టిన రేవంత్‌రెడ్డి
మేడిగడ్డను సందర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యేల బృందం
మహబూబాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నమ్మిం చి మోసం చేస్తోందని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బయటకు వస్తుండంటేనే సీఎం రేవంత్‌రెడ్డికి భయం పట్టుకుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎద్దేవా చేశారు.
శనివారం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బరాజ్‌ను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అధ్యక్షతన మాజీ మంత్రి డా.రాజ య్య, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్క ర్, మాజీ ఎంపీ మలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్, అరూరి రమేష్, దాసరి మనోహర్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, భూపాలపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిణితో కలిసి ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ ఆనాడు నల్లొండలో, ఈనాడు జగిత్యాలలో మీటింగ్ పెడితే రేవంత్‌రెడ్డి బయటకు వస్తున్నారన్నారు. కేసీఆర్ సభకు పోటీగా మీటింగ్ పెట్టడం కాదని, దమ్ముంటే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చే సభలను పెట్టాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ బరాజ్‌కు మరమ్మతులు చేస్తమని ఎల్‌ఎన్టీ కంపెనీ హామీ ఇచ్చినా, గత ప్రభుత్వాన్ని బదనాం చేసి మూడేళ్ల నుంచి తెలంగాణ రైతులను గోస పెడుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని సుందిళ్ల, అన్నారం బరాజ్‌లు నిర్మించారని, 140టీఎంసీల స్టోరేజ్ ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు.
చరిత్రలో నిలిచిపోయే విధంగా కేసీఆర్ కాళేశ్వరం నిర్మించారన్నారు. రెండు పిల్లర్లకు ఇబ్బంది అయితే ప్రాజెక్టు పూర్తిగా కూలిపోయిందని ప్రచారం చేసి, గత ఎన్నికల్లో లబ్ధిపొందారని, ఈనాడు ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం అర్థం అయిందని, ఎక్కడ ఏ ఎన్నికలు పెట్టినా ప్రజలు కాంగ్రెస్ దుమ్ము రేపుతారన్నారు. కేవలం జగిత్యాలలో కేసీఆర్ సభను ఫెయిల్ చేయాలనే కుట్రతోనే సీఎం మేడిగడ్డకు వచ్చి ఇక్కడ అధికారులతో సమీక్ష పెడుతున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డిని ఇటు ప్రజలు, అటు అధికారులు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.
మూడేళ్లుగా ఇక్కడ ఇసుక మాఫియా నడుస్తుంటే ఏం చేస్తున్నార ని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫ ల్యం మూలంగా పొలాలు ఎండిపోతున్నాయ ని, సకాలంలో ఎరువులు అందడం లేదని, రైతులకు బోనస్, రైతుభరోసా ఇవ్వడంలేదన్నారు. ఎస్సారెస్పీ, శ్రీరాంసాగర్‌లను కాంగ్రె స్ కట్టింది నిజమే కావచ్చు. కానీ, ఆనాడు మహారాష్ట్రలో అక్రమంగా ప్రాజెక్టులు కట్టి శ్రీరాంసాగర్‌కు చుక్క నీళ్లు రాకుండా చేసిన సమయంలో తనతో పాటు సీఎం రేవంత్‌డ్డి ధర్నా చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించా రు.
తెలంగాణ రాష్ట్రంలోని కాలువల్లో చుక్క నీరు లేక పిచ్చిమొక్కలు మొలిచాయని, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాతనే తెలంగా ణ ఇప్పుడు బాగుపడిందని, సస్యశ్యామలం అయిందన్నారు. కేవలం జగిత్యాల కేసీఆర్ సభను ఫెయిల్ చేయాలనే రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని, ఇక్కడకు వచ్చి ఏం చేస్తారో ముందు సమాధానం చెప్పాలన్నారు. జగిత్యాల మీటింగ్‌కు ఎక్కువగా ప్రజలు స్వచ్ఛం దంగా వచ్చేందుకు సిద్ధమవుతున్నారన్నారు.






