10 August, 2026 | 6:35 AM

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందని..

26-05-2024 01:26 AM

నిజామాబాద్, మే 25 (విజయక్రాంతి): ఓ కసాయి తల్లి వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందని, ప్రియుడితో కలిసి కన్న కూతురినే హతమార్చేందుకు యత్నించింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి.. ఎడపల్లి మండలం జాన్కంపేట శివారులోని నిజాంసాగర్ కెనాల్ వద్ద నిజామాబాద్‌కు చెందిన 15 ఏళ్ల బాలిక తీవ్రగాయాలతో పడి ఉండడంతో స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ కేసుపై పోలీసులు విచారణ చేపట్టగా.. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందని భావించి తల్లే హత్య చేసేందుకు యత్నిం చినట్లు తెలిసింది. బాధితురాలి తల్లి తన ప్రియుడైన ఆటో డ్రైవర్‌తో కలిసి బాలికను నిజాంసాగర్ కెనాల్ వద్దకు తీసుకెళ్లి మెడకు ఉరి వేసింది. బాలిక మరణించిందని భావించి అక్కడే వదిలేసి పారిపోయారు. కాగా తీవ్రగాయాలతో ఉన్న బాలికను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఈ విషయం వెలుగు లోకి వచ్చింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.