22 August, 2026 | 2:01 AM

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు

22-08-2026 12:42 AM

రెవెన్యూ, గృహ నిర్మాణం, ఐ అండ్ పీఆర్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

కోరుట్ల/మెట్ పల్లి, ఆగస్టు 21(విజయక్రాంతి):అర్హులైన ప్రతి పేద కుటుంబానికి కు లం, మతం, రాజకీయాలకు అతీతంగా ఇం దిరమ్మ ఇల్లు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.శుక్రవా రం జగిత్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల తో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమం లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్ధులు, వికలాంగులు,

ట్రాన్స్జెండర్ సాధికారిత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సి.సి. ఎల్.ఏ. కమిషనర్ లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతు, హౌసింగ్ ఎం. డి. గౌతమ్, వెలమ సంక్షేమ సంఘం కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడ నరసింగరావు, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తదితరులతో కలిసి మంత్రి పాల్గొన్నారు.

ముందుగా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ప్రా రంభించారు.మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడమే ప్రజా ప్రభుత్వం ల క్ష్యమని అన్నారు. పేదల సంక్షేమానికి ప్రభు త్వం ఎల్లప్పుడూ కృషి చేస్తోందని, సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అ నేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. జగిత్యాల జిల్లాలో ఆర్డీవో కార్యాలయం, సబ్రిజిస్ట్రార్ కార్యాలయం, త హసీల్దార్ కార్యాలయాల నిర్మాణాలకు శం కుస్థాపనలు చేసినట్లు చెప్పారు.

గత ప్రభు త్వం నూకలపల్లి 2బీహెచ్కే కాలనీలో అవసరమైన మౌలిక వసతుల కల్పనపై నిర్లక్ష్యం చే సిందని మంత్రి అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి దశలో రూ.32 కో ట్లతో తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ తదితర సౌ కర్యాలు కల్పించినట్లు తెలిపారు. రెండో ద శలో పాఠశాల ఏర్పాటు కోసం త్వరలోనే ని ధులు విడుదల చేస్తామని చెప్పారు.నూకలపల్లి 2బీహెచ్కే కాలనీలో రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలని, బస్సు సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ను మంత్రి ఆదేశించారు.

కాలనీలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటామని తెలి పారు. 2008లో పునాది వేసిన కాలనీలో 18 సంవత్సరాల తర్వాత ప్రజలకు అవసరమైన సౌకర్యాలతో ఇళ్లు అందించగలిగామని చెప్పారు.కులం, మతం, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇం దిరమ్మ ఇల్లు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ఇందిరమ్మ ఇళ్ల కోసం మరోసారి పత్రికా ప్రకటన ఇచ్చి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, క్షేత్రస్థాయిలో విచారణ అనంతరం అర్హులైన ప్రతి కుటుంబానికి ఇ ల్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన పేదలకు ఇళ్లు అం దించేందుకు ఎలాంటి ఆందోళనలు, పోరాటాలు అవసరం లేదని, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేస్తుందని తెలిపారు.

భూ రీ సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

భూ రీ సర్వే ద్వారా రాష్ట్రంలోని అన్ని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఏడాదిన్నరలోపు వ్యవసాయ భూములతో పాటు ఆబా ది ఆస్తుల రీ సర్వేను పూర్తి చేయాలని లక్ష్యం గా పెట్టుకున్నట్లు చెప్పారు.రాష్ట్రంలో తొలి దశలో ప్రతి జిల్లాలో 70 గ్రామాలను ఎంపి క చేసి భూ రీ సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. జగిత్యాల జిల్లాలో కూడా ఎంపిక చేసి న గ్రామాల్లో రీ సర్వే కొనసాగుతోందన్నా రు.

రీ సర్వే అనంతరం అర్హులైన రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నకిలీ పాస్ పుస్తకాలను గుర్తించి రద్దు చేస్తామని తెలిపారు.గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు ప్రయోజనాలు పొందేందుకు అర్హత లేని వారికి, నకిలీ పాస్ పుస్తకాల ఆధారంగా ప్రయోజనాలు అందిన పరిస్థితులు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. భూ రీ సర్వే అనంతరం నిజమైన రైతుల హక్కులను పరిరక్షిస్తూ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు.