చేయూత పింఛన్ల కొరకు దరఖాస్తులు చేసుకోవాలి
ఈ నెల 31 చివరి తేదీ..
మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్, ఆగస్టు 21 (విజయక్రాంతి): చేయూత పింఛన్ల దరఖాస్తుల పరిష్కారం కోసం కలెక్టరేట్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు, అలాగే ఈనెల 26వ తేదీన దివ్యాంగుల కొరకు ప్రత్యేక యు డిఐడి శిబిరం నిర్వహిస్తున్నట్లు చేయూత పింఛన్ల దరఖాస్తులు మండల మరియు గ్రామపంచాయతీ కార్యాలయాల్లో సమర్పించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
చేయూత పింఛన్ల దరఖాస్తుల స్వీకరణపై జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ మాట్లాడుతూ కొత్త చేయూత పింఛన్లు దరఖాస్తులు మండల మరియు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరించబడుతున్నాయని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణలో ఏమైనా సమస్యలు ఉత్పన్నమైన ఎడల వెంటనే దరఖాస్తుదారులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గల హెల్ప్ డెస్క్ ను సంప్రదించాలన్నారు. 8008556112 చేయూత పెన్షన్లు హెల్ప్ డెస్క్ నెంబర్ ను సంప్రదించాలన్నారు.
ఇంకా ఎవరైనా దివ్యాంగులు యూ డి ఐ డి ధ్రువీకరణ పత్రం లేనియెడల వారు తక్షణమే మీసేవ సెంటర్లో దరఖాస్తు చేసుకున్న ఎడల ఆగస్టు 26వ తేదీన మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో GGHలో ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇంకా మిగిలి ఉన్న వారు మీసేవ సెంటర్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. పింఛన్ల కొరకు దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులు ఏదైనా ధృవీకరణ పత్రం లేనియెడల వెంటనే సంబంధిత అధికారుల దగ్గరకు వెళ్లి తక్షణమే తీసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
ధ్రువీకరణ పత్రాలు తీసుకునేటప్పుడు ఏదైనా సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే కలెక్టరేట్లో ఉన్న హెల్ప్ డెస్క్ సహాయకారిణిగా పనిచేస్తుందని, సమస్య ఉన్నట్ల యితే వెంటనే హెల్ప్ డెస్క్ ను సంప్రదించాలన్నారు. అర్హులైన వారు చేయూత పింఛన్ల కొరకు దరఖాస్తు చేసుకోవాలని వీరికి ప్రభుత్వ యంత్రాంగం సహాయకారిణిగా పనిచేస్తుందన్నారు. లబ్ధిదారుల చేసుకున్న దరఖాస్తులను సకాలంలో తీసుకొని వెంటనే ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సంబంధిత ఎంపీడీఓ లను కలెక్టర్ ఆదేశించారు.






