08-11-2025 01:14:31 AM
జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఫిషరీస్ చైర్మన్ సాయికుమార్
హైదరాబాద్, నవంబర్ 7(విజయక్రాంతి):ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయనకి ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ సృజనాత్మకంగా పుటిన రో జు శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్‌రెడ్డి పేద ల కోసం తెచ్చిన సన్నబియ్యం పథకాన్ని గుర్తుచేసేలా, పేదోడికి కడుపు నిండా సన్నబియ్యంతో అన్నం పెడుతున్న రేవంత్ రెడ్డికి సన్నబియ్యంతో చిత్రపటాన్ని చేయించి కృతజ్ఞత చాటారు. పేదలకి ఉచిత సన్నబియ్యాన్ని ఇచ్చిన రేవంత్ వందేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని సాయికుమార్ ఆకాంక్షించారు.