calender_icon.png 8 November, 2025 | 6:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాబార్డు భాగస్వామ్యం అవసరం

08-11-2025 01:14:45 AM

మంత్రి తుమ్మల నాగేశ్వరావు 

హైదరాబాద్, నవంబర్ 7 (విజయక్రాం తి): రైతుల ప్రయోజనాలు, అభివృద్ధి కోసం నాబార్డు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరారావు కోరా రు. నాబార్డ్ సీజీఎం ఉదయ్ భాస్కర్, ఇతర అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరావు శుక్రవారం సమావేశమై గ్రామీణాభివృద్ధి, మైక్రో ఇరిగేషన్ కోసం చర్చించారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, సూక్ష్మ సా గు, సహకార రంగ బలోపేతం వంటి అంశా ల్లో తెలంగాణ ప్రభుత్వానికి నాబార్డ్ మద్దతు ఇస్తోందని ఇదేంతో ప్రశంసనీయమన్నారు.

గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి కింద 2025 -26 ఆర్థిక సంవత్సరానికి నాబార్డ్ రూ. 300 కోట్లు రాష్ట్రానికి కేటాయించినట్లు నాబార్డు అధికారులు తెలిపారు. ఈ నిధులు తక్కువ వడ్డీ రేటుతో4.25 శాత ంతో అందిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యల వలన రైతుల ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయని మంత్రి వివ రించారు.    రైతుల ప్రయోజనాలు, వారి అర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, అందుకు అనుగుణంగా అనేక పథకాలు పునరుద్ధరిస్తున్నట్టు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలలో నాబార్డు భాగస్వామం కొనసాగించాలన్నారు.