08-11-2025 01:13:31 AM
మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్, నవంబర్ 7 (విజయక్రాం తి): జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని తేలడంతో.. కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దిగజార్చాలనే కుట్ర చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. అందుకే బాకీ కార్డు పేరుతో అసత్య ప్రచారా లు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి పొ న్నం ప్రభాకర్‌తో కలిసి శుక్రవారం గాంధీభవన్‌లో జూపల్లి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిందెవరో..? దోచుకున్నది ఎవరో ప్రజలకు తెలుసన్నారు.
రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించారని, గతంలో ఏ సీఎం కూ డా ఇన్ని అప్పులు చేయలేదన్నారు. కేసీఆర్ చేసిన అప్పులకు తమ ప్రభుత్వం ఏడాదికి రూ. 75 వేల అప్పులు కడుతూనే ప్రజలకిచ్చి న హామీలను అమలు చేస్తున్నామని తెలిపా రు. వారు చేయలేని పనులను తమ ప్రభుత్వం రెండేళ్లలోనే చేసి చూపించిందని తెలిపారు.