ప్రజా స్థలాల్లోని నిర్మాణాలపై విచారణ జరపాలి
ప్రజావాణిలో అధికారులకు వీహెచ్పీ వినతి
వేములవాడ, ఆగస్టు 24, (విజయ క్రాంతి): వేములవాడ పట్టణంలోని 11వ వా ర్డు పరిధిలో సర్వే నంబర్లు 1389, 1390, 1391లో జరుగుతున్న నిర్మాణాలపై సమగ్ర విచారణ చేపట్టి, ప్రజా అవసరాలకు కేటాయించిన స్థలాలను పరిరక్షించాలని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) నాయకులు కో రారు. ఈ మేరకు సోమవారం మండల స్థా యి ప్రజావాణిలో మండల అభివృద్ధి అధికారి (అర్బన్)కు వినతిపత్రం అందజేశారు.
సదరు సర్వే నంబర్లలో ఇప్పటికే మసీదు నిర్మాణం జరిగిందని, లేఅవుట్లో ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలంలో షాదీఖానా నిర్మాణం జరుగుతోందని వీహెచ్పీ నాయ కులు పేర్కొన్నారు. ఆయా నిర్మాణాలకు ఉన్న అనుమతులు, భూమి వినియోగం, లేఅవుట్ రికార్డులను రెవె న్యూ, మున్సిపల్, టౌన్ ప్లా నింగ్ అధికారులు పరిశీలించాలని కోరారు. క్షేత్రస్థాయిలో విచారణ జరి పి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినట్లు తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజా అవసరాలకు కేటాయించిన స్థలం భవిష్యత్తులోనూ స్థానికులకు ఉపయోగపడేలా ఓపెన్ జిమ్, పా ర్కు, గ్రంథాలయం వంటి సౌకర్యాలు ఏర్పా టు చేయాలని కోరారు. ఈ అంశంపై గతం లో మున్సిపల్ కమిషనర్కు సమర్పించిన వినతిపత్రాల ప్రతులను కూడా అధికారులకు అందజేశారు.కార్యక్రమంలో వీహెచ్పీ పట్టణ అధ్యక్షుడు పల్లె శ్యామ్సుందర్రెడ్డి, కార్యదర్శి గుండు జి.గోపాల్, జిల్లా కార్యదర్శి గడప కిషోర్రావు, తిప్పర్తి సాయికృష్ణ పాల్గొన్నారు.






