5 September, 2026 | 11:07 AM

చిరుత పులి సంచారం.. భయాందోళనలో ప్రజలు

25-08-2026 | 01:39am

మద్దూర్ ఆగస్టు 24 :  మండల పరిధిలోని దోరేపల్లి శివారు పల్లెగడ్డ తండాలో ఆదివారం రాత్రి పది గంటల సమయంలో చిరుతపులి సంచారహించినట్లు గ్రామస్తులు తెలిపారు. వ్యవసాయ పొలాల దగ్గరికి వెళ్లాలంటే ప్రజలు భయాందోళనకు గురవుతు న్నారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లక్ష్మణ్ నాయక్ ముద్రలను గుర్తించి ఇది చిరుత పులి అని ఆయన నిర్ధారించారు ప్రజలు ఇంట్లో నుంచి రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లో బయటకి రావద్దని ఆయన గ్రామస్తులకు తెలియజేశారు.


మరిన్ని వార్తలు