calender_icon.png 16 October, 2024 | 12:17 AM

వివాహితతో చనువుగా మారిన పరిచయం

13-09-2024 12:23:07 AM

  1. మనస్పర్థల కారణంగా ఇద్దరి మధ్య గొడవలు 
  2. పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య

మహేశ్వరం, సెప్టెంబర్ 12: కందుకూరు పీఎస్ పరిధిలో వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిల మురళీనగర్‌కు చెందిన ముడావత్ పురందాస్ (32) అదే గ్రామానికి చెందిన కవిత(వివాహిత)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా చనువుగా మారగా.. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. అప్పటికే పెండ్లి అయిన కవిత.. పురందాస్ సోదరుడు శంకర్‌కు ఫోన్‌చేసి మీ తమ్ముడిని అదుపులో పెట్టుకోవాల్సిందిగా బెదిరించింది.

కవిత ఫోన్ చేసి బెదిరించిన సంగతి శంకర్.. తమ్ముడు పురందాస్‌కు చెప్పాడు. ఈ క్రమంలో ఈనెల 7న పురందాస్ పొలానికి వెళ్లి.. అన్న శంకర్ ఫోన్‌కు వాట్సాప్ ద్వారా ‘నేను చనిపోతున్నాను. నా చావుకు కవిత, కాట్రావత్ కిరణ్, వంకదావత్ గురుసింగ్ కారణమని మెసేజ్ చేశాడు. మెసేజ్ చూసిన వెంటనే శంకర్ పొలానికి వెళ్లాడు. అయితే అప్పటికే పురందాస్ సృహతప్పి పడిపోయి ఉన్నాడు.

పురందాస్‌ను వెంటనే డీఆర్‌డీఎల్ ఒవైసీ ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించారు. ఉస్మానియాలో చికిత్స పొందుతూ పురందాస్ ఈనెల బుధవారం మృతి చెందాడు. కందుకూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.