20 June, 2026 | 3:30 AM

పలివెల కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షునిగా ఆనగంటి కృష్ణ

20-06-2026 01:36 AM

మునుగోడు, జూన్ 19 : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం పలివెల గ్రామంలో కాంగ్రెస్ గ్రామశాఖ నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమనపల్లి సైదులు ఆధ్వర్యంలో గ్రామశాఖ అధ్యక్షుడిగా ఆనగంటి కృష్ణ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఉపాధ్యక్షులుగా కొండూరు మల్లికార్జున్, గోసుకొండ కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శులుగా పంతంగి గిరి, రూపని బాలరాజు, కోశాధికారిగా చెరుకుపల్లి రాములు, కార్యవర్గ సభ్యులుగా గుత్తి శంకర్, వరికుప్పల శంకర్, చిలువేరు నరసింహ, దాడి రాజిరెడ్డి, గోసుకొండ రవిలను ఎంపిక చేశారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సునీతసైదులు, జిల్లా నాయకుడు చెరుకుపల్లి వెంకన్న, మాజీ సర్పంచ్ చెరుకుపల్లి పద్మజనార్దన్, నాయకులు గోసుకొండ శంకర్, మాజీ అధ్యక్షుడు బాసరాజు యాదగిరి, పాలకేంద్రం చైర్మన్ గోసుకొండ వెంకులు, మార్త నర్సిరెడ్డి, వార్డు సభ్యులు కొండూరు మాధవి, బత్తుల ప్రవీణ్ పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.