ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
20-06-2026 01:35 AM
కల్వకుర్తి జూన్ 19: అంతర్జాతీయ యోగా వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివరాం ఆధ్వర్యంలో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో యోగా మాస్టర్ సునంద గర్భిణీ స్త్రీలు, ఆసుపత్రి సిబ్బందికి యోగాసనాలు చేయించారు.
యోగా చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గడమే కాకుండా శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని గర్భిణీలకు యోగా ఎంతో ఉపయోగకరమన్నారు, సాధారణ ప్రసవాలు జరిగే అవకాశాలను పెంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ యశోద, నర్సింగ్ సిబ్బంది శిరోమణి, ఉమా, స్వరూప, కవిత, భారతి తదితరులు పాల్గొన్నారు. యోగ సాధన ద్వారా ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని వైద్య సిబ్బంది సూచించారు.






