28-11-2025 10:23:47 PM
తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం కందనెల్లి తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఆనంద నాయక్ నేడు కందనెల్లిలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి తాండ ప్రజల ఆశీర్వాదం తనకే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తండా అభివృద్ధికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో తన వంతు కృషి చేస్తానని అన్నారు.