28-11-2025 09:56:05 PM
మంథని,(విజయక్రాంతి): మంథని మున్సిపల్ పరిధిలో క్షుద్ర పూజల కలకలం రేపుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున మంథని పట్టణంలోని కన్యక పరమేశ్వరి దేవాలయం సమీపంలోని బోయినపేటకు వెళ్లే రహదారిలో మూడు రోడ్ల వద్ద గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. దీంతో మంథని ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. కంప్యూటర్ రోజుల్లో కూడ ఇంకా ఇలాంటి మూఢనమ్మకాలు తో జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్న వ్యక్తులపై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజల కోరుతున్నారు.