28-11-2025 09:51:08 PM
కాటారం,(మహాముత్తారం),(విజయక్రాంతి): ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన ముఖ్యమని మహాముత్తారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ దీప్తి అన్నారు. శుక్రవారం కస్తూర్బా గాంధీ బాలికల గురుకులం జూనియర్ కళాశాలలో మహాదేవపూర్ ఐసీటీసీ, ఎస్ఎస్కె ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఎయిడ్స్ వ్యాధి లక్షణాలు, వ్యాప్తి విధానాలు, నివారణ చర్యలు, తదితర అంశాలపై ఐసీటీసీ కౌన్సిలర్ గాదె రమేష్ అవగాహన కల్పించారు. సంపూర్ణ సురక్ష కేంద్రం కార్యక్రమం గురించి వివరించారు.