calender_icon.png 28 November, 2025 | 10:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు చిలువేరి హర్షిత్‌ ఎంపిక

28-11-2025 09:58:55 PM

సుల్తానాబాద్,(విజయ క్రాంతి): సుల్తానాబాద్‌ కేరళ మోడల్ హైస్కూల్ కు  చెందిన విద్యార్థి చిలువేరి హర్షిత్‌ ఎస్జీఎఫ్ఐ రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు అండర్–17 విభాగంలో ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్‌ సిజ్జు నాయరు, వైస్‌ ప్రిన్సిపాల్‌  స్మిత నాయర్, ఉపాధ్యాయులు శుక్రవారం హర్షిత్‌కు అభినందనలు తెలిపారు. హర్షిత్‌ కృషి, పట్టుదల, క్రీడాస్ఫూర్తికి ప్రశంసలు అందించారు. రాబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో మంచి ప్రదర్శనతో మరిన్ని విజయాలు సాధించాలని పాఠశాల సిబ్బంది, విద్యార్థులు హర్షిత్‌కు శుభాకాంక్షలు తెలిపారు.