28-11-2025 10:12:15 PM
రేగొండ,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ నామినేషన్ కేంద్రాలను భూపాలపల్లి జిల్లా ఎస్పీ ఎస్.సంకీర్త్ శుక్రవారం సందర్శించారు.అనంతరం రేగొండ పోలీస్ స్టేషన్ ను సందర్శించి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రామపంచాయతీ ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా ఉమ్మడి రేగొండ మండల కేంద్రంలో మొదటి ఫేజ్ లో గ్రామపంచాయతీ ఎలక్షన్స్ నామినేషన్ ప్రక్రియ జరుగుతున్నందున సజావుగా సాగేలా పోలీస్ శాఖ తరపున అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. నామినేషన్ సెంటర్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భద్రత ఏర్పాట్లు ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గణపురం సిఐ. కర్ణాకర్ రావు, రేగొండ ఎస్సై కె.రాజేష్,రెండో ఎస్సై త్రిలోక్ నాథ్ రెడ్డి, కొత్తపల్లి గోరి ఎస్సై ఎస్.దివ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.