28-11-2025 10:09:21 PM
షఫీకి సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ2.40 లక్షల సాయం
ప్రజల పట్ల బాధ్యత మరోసారి చాటుకున్న వజ్రెష్ యాదవ్
మేడిపల్లి,(విజయక్రాంతి): బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధి అశోక్ నగర్‌కు చెందిన మొహమ్మద్ షఫీ కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఇటీవల కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల గురించి తెలుసుకున్న మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ వెంటనే స్పందించి సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.2,40,000 మంజూరు అయ్యేలా అవసరమైన పత్రాల సమీకరణ, ఫైల్ ప్రాసెసింగ్ వరకూ మొత్తం ప్రక్రియను వ్యక్తిగతంగా పర్యవేక్షించి సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కును షఫీ తండ్రి మొహమ్మద్ మొయినుద్దీన్ కు అందజేశారు. ఈ సందర్భంగా వజ్రెష్ యాదవ్ మాట్లాడుతూ... కష్టాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి, ఏ పార్టీ, ఏ మతం, ఏ వర్గం అనే తేడా లేకుండా సహాయం అందేలా పనిచేయడం తమ బాధ్యత అని తెలిపారు. ఈ సందర్భంగా షఫీ కుటుంబ సభ్యులు వజ్రెష్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో షఫీ పూర్తిగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.