calender_icon.png 28 November, 2025 | 10:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాసానిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఏకగ్రీవం.?

28-11-2025 10:06:06 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని మాసానిపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ చిన్నపట్లోళ్ల సునందను గ్రామస్తులు శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.సర్పంచి పదవికి పోటీదారులు ఉన్నప్పటికీ గతంలో పదవులు చేసినవారు మళ్లీ సర్పంచ్ పదవికి పోటీచేస్తే పోటీ అభ్యర్థుల సంఖ్య పెరుగుతుందని, పోటీకి ఆశామహులైన అభ్యర్థులు ఒకరిపై ఒకరు పదవులు దక్కనియ కూడదన్న పట్టుదలతో నేను లేకున్నా ఫలానా వ్యక్తి సర్పంచిగా ఉండకూడదని,

అనే ఆలోచన విధానంలో గ్రామంలోని అందరికీ సమ్మతమైన వ్యక్తి పెద్దపట్లోళ్ల కిషన్ రెడ్డి భార్య సునందను మీరు సర్పంచ్కి ఈసారి ఉండాలని గ్రామస్తులంతా కిషన్ రెడ్డిని గ్రామ కచేరి వద్దకు గ్రామస్తులు సమావేశంకు పిలిచి గ్రామస్తులంతా కోరగా కిషన్ రెడ్డి తన భార్య సునందను సర్పంచ్ పదవికి ఉండడానికి ఒప్పుకున్నాడు.గ్రామంలోని 8 వార్డులు ఉండగా ఆవార్డులలో వార్డు సభ్యులకు పోటీ చేసే ఆశమవులు గ్రామ సమావేశంలో అభిప్రాయాలను వెల్లడించగా గ్రామస్తులకు నచ్చిన అన్ని వాడలకు వర్గాలకు వార్డుసభ్యుల పదవులు ఉండే విధంగా ఆలోచించి వార్డుసభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

నాగిరెడ్డిపేట మండలంలో మొట్టమొదటిసారి సర్పంచ్తో పాటు వార్డుసభ్యులు పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఇదే మొదటిసారీ మొదటి గ్రామం.పాలకవర్గం మొత్తాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల మండలంలోని పలు గ్రామాలు వారి బాటలో పయనించాలన్న ఆలోచనలో పడ్డారు.మాసంపల్లి గ్రామస్తులు పంచాయతీ పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకొని మండలానికి ఆదర్శంగా ఆగ్రామస్తులు నిలిచారు.