calender_icon.png 16 June, 2025 | 5:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో ఆంధ్రాకింగ్ తాలూకా

16-06-2025 12:39:10 AM

రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. మహేశ్‌బాబు పీ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర సూపర్ స్టార్ సూర్యకుమార్ అనే పాత్రలో కనిపించనున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫాక్టరీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో రామ్, ఉపేంద్ర పాల్గొంటున్నారు. కీలక టాకీ పార్ట్ షూట్ చేస్తున్నారు. రామ్, ఉపేంద్ర కాంబినేషన్‌లో వచ్చే ఈ సన్నివేశాలు సినిమాలో పతాక స్థాయిలో ఉండబోతున్నాయి. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ డీవోపీ: సిద్ధార్థ నూని.