3 July, 2026 | 10:41 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

సమస్యలు లేని అంగన్వాడీ కేంద్రాలుగా తీర్చిదిద్దాలి

20-06-2025 12:00 AM

 : మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా

ఘట్ కేసర్, జూన్ 19 : సమస్యలు లేని అంగన్ వాడి కేంద్రాలుగా తీర్చి దిద్దాలని మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా అన్నారు. ఘట్ కేసర్ మున్సిపల్ పరిధిలోని ఘనపూర్, ఏదులాబాద్ గ్రామాలలో అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా గురువారం పర్యటించి ఇందిరమ్మ ఇ ళ్ల నిర్మాణాలు, అంగన్ వాడి కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏదులాబాద్ లోని అంగన్ వాడి కేంద్రంలో విద్యుత్, తాగునీరు సమస్యతో పాటు పరిశుభ్రతను పరిశీలించారు.

తాగునీటి సరఫరా నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ఏఈ రాకేష్ ను ఆదేశించారు. చుట్టు ప్రహరీ గోడ కావాలని కోరటంతో  ప్రహరీ గోడ నిర్మాణంతో పాటు అదనపు గదుల ను ఏర్పాటు చేయాలని పంచాయతీ రాజ్ ఏఈ జగపతిబాబును ఆదేశించారు. ము న్సిపల్ పరిధిలోని అంగన్ వాడి కేంద్రాలలో సమస్యలు లేకుండా నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆమె తెలిపారు.

ఘనపూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ఆమె పరిశీ లించారు. ఇంటి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగపరుచుకోవాలని ఆమె చెప్పారు. అడిషనల్ కలెక్టర్ వెంట మున్సిపల్ కమీషనర్ చంద్రశేఖర్, మేనేజర్ వేణుగోపాల్ రెడ్డి, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ కవిత, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.