3 July, 2026 | 11:35 PM

Breaking News

బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీకి పూర్వవైభవం   •   పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •  

విద్యుత్ లైన్‌మన్ లేక ఇబ్బందులు

20-06-2025 12:00 AM

పడుతున్న 3వ వార్డు ప్రజలు

కొత్తపల్లి, జూన్ 19 (విజయ క్రాంతి): నగరపాలక సంస్థ లో ఇటీవల విలీనం అయిన దుర్షెడ్ గ్రామం వార్డు నంబర్ 3లో గత రెండు సంవత్సరాలగా లైన్మెన్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెండు సంవత్సరాల క్రితం లైన్మెన్ మారుతిని సస్పెండ్ చేశారు. అప్పటినుండి లైన్ మెన్ లేక, ఏదయినా అత్యవసర పరిస్థితి ఏర్పడితే విద్యుత్ శాఖ నుండి ఒక్కరు అదుబాటులో ఉండరని, ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయరని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు.

విద్యుత్ కు సంబంధించి ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు ప్రైవేటు వ్యక్తులతో మరమ్మతులు చేపిస్తున్నారని వారికి సరైన నైపుణ్యం లేక..ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే దానికి ఎవరు బాధ్యత వస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా గురువారం ఉదయం 6 గంటల నుంచి దుర్షెడ్ కొన్ని వార్డుల్లో పవర్ నిలిచిపోయిన నేపథ్యంలో సాయంత్రం వరకు కూడా పవర్ రిస్టోర్ చేయని పరిస్థితి నెలకొన్నదని..

ఎవరిని అడగాలో తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. కనీసం జూనియర్ లైన్మెన్ అయినా దుర్షెడ్ హెడ్ కోటర్ లో అందుబాటులో ఉండడం లేదని.. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి లైన్మెన్ ఏర్పాటు చేసి సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.