20-06-2025 12:07:24 PM
ఖానాపూర్ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడి టీచర్లు, ఆయాల ,పోస్టులు ఖాళీ
ఖానాపూర్(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఐసిడిఎస్ ప్రాజెక్టు(Khanapur ICDS Project) పరిధిలో అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఆయాల పోస్ట్లు, పదుల సంఖ్యలో ఖాళీలు ఉన్న అవి భర్తీకి నోచుకోవడం లేదని పలువురు ఆశావాహులు అంటున్నారు. ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ ఉపాధ్యాయులు 19, ఆయాలు 40 పోస్టులకు పైచిలుకు మండలాల్లో ఖాళీగా ఉన్న ఏళ్ల తరబడి ఆ శాఖ నుంచి నోటిఫికేషన్ వెలువడడం లేదని పలువురు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఎంతోమంది ఆశావహులు ఆయా మండలాల నుంచి ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వాల నుంచి జరిగిన అలసత్వంతో ఈ భర్తీ నిలిచిపోగా, ప్రస్తుత నాయకులు పట్టించుకుని భర్తీ చేపట్టాలని ఆశావహులు మనవి చేస్తున్నారు.