20-06-2025 12:51:04 PM
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రజా ప్రతినిధుల సమావేశం జరిగింది.కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) అధ్యక్షతన ప్రజాప్రతినిధుల సమావేశం కొనసాగుతోంది. సమావేశానికి రాష్ట్ర ఇన్ ఛార్జ్ లు సునీల్ బన్సల్, అభయ్ పాటిల్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) పాలనలో జరిగిన అవినీతిపై ప్రజలకు వివరించాలి, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అవగాహనతో ఉన్నాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని ఆరు గ్యారెంటీల గురించి ప్రజలకు చెప్పాలన్నారు. రాష్ట్రాన్ని రక్షిచాలంటే బీజేపీ ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు. ప్రజలకు విశ్వాసం కల్పించి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కిషన్ రెడ్డి కోరారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు జరగవని ఆయన పేర్కొన్నారు.