02-05-2025 12:00:00 AM
విద్యార్థి దశకు 10 వతరగతి తొలిమెట్ట
ప్రభుత్వ జిల్లా పరీక్షల సహాయ కమిషనర్ ఉదయ్‌బాబు
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే1( విజయ క్రాంతి): విద్యార్థులు ఎంచుకున్న లక్ష్యం సాధించడానికి నిరంతరం కృషి చేయాలని ప్రభుత్వ జిల్లా పరీక్షల సహాయ కమిషనర్ ఉదయ్‌బాబు అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని మండల రిసోర్స్ సెంటర్ లో గుర్తింపు పొందిన పాఠశాలల సంఘం( ట్రస్మా ) ఆధ్వర్యంలో మంగళవారం 10వ తరగతి జిల్లా టాపర్ల ఋకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో మండల విద్యాధికా రి సుభాష్‌తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశకు 10 వతరగతి తొలిమెట్టని అన్నారు. భవిష్యత్తులో ఉన్నత చదువులు అభ్యసించి జిల్లాకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.
గుండేటి వర్షిత్ 564 , మిత్ర వింద 573 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో టాపర్ గా నిలిచిన విద్యార్థులను జిల్లా పరీక్షల సహాయ కమిషనర్ ఉదయ్ బాబు. ఎంఈ ఓ.సుభాష్ ట్రస్మా అధ్యక్షుడు దేవాబుషణం లు శాలువా పులమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా కార్యానిరాహక కార్యదర్శి చిలుకూరి రాధాకృష్ణ చారి, ప్రధానాచార్యులు గుండెటి కోటేశ్వరరావు. నరేందర్ కుమార్, నాగేంద్ర తిరుపతి క్రాంతి కుమార్, తదితరులు పాల్గొన్నారు.