7 July, 2026 | 8:00 AM

15 రోజుల్లో బీఆర్‌ఎస్‌ ఆఫీసును కూల్చేయండి.. హైకోర్టు ఆదేశం

18-09-2024 03:37 PM

హైదరాబాద్‌: భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)కి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. నల్గొండలోని పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లో కూల్చివేయాలని ఆదేశించింది. బిఆర్‌ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు బుధవారం కొట్టివేసింది. కార్యాలయాన్ని కొనసాగించాలని బీఆర్ఎస్ చేసిన విజ్ఞప్తికి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. నిర్ణీత గడువులోగా పార్టీ కార్యాలయాన్ని తొలగించాలని హైకోర్టు సూచించింది.