13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

హైదరాబాద్‌లో వైభవంగా శ్రీరామ శోభాయాత్ర.. ట్రాఫిక్ ఆంక్షలు

27-03-2026 11:41 AM

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లో వైభవంగా శ్రీరామ శోభాయాత్ర(Sri Rama Navami Shobha Yatra) కొనసాగుతోంది. శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు(Traffic Restrictions) విధించారు. రాత్రి 9 గంటల వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాలు మళ్లిస్తారు. సీతారాం బాగ్ ఆలయం నుంచి సుల్తాన్ బజార్ వరకు శోభాయాత్ర కొనసాగనుంది. శోభ యాత్ర సాగే మార్గాల్లో వాహనాలకు అనుమతి లేదని అధికారులు ప్రకటించారు. నిర్మల్ జిల్లాలో శ్రీరామనవమి శోభయాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిర్మల్, బైంసా పట్టణాల్లో శ్రీరాముని శోభాయాత్ర కొనసాగుతోంది. నిర్మల్ లో 400 మంది, బైంసాలో 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.