15-04-2025 01:23:18 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల(SC Reservations) అమలుకు ఉత్తర్వులను చేయడానికి హర్షిస్తూ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణ పరిధిలోని అమీనాపురంలో డిసిసి ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా వర్గీకరణ కోసం ఎదురుచూస్తున్న ఎస్సీలకు సీఎం రేవంత్ రెడ్డి అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభవార్త చెప్పారని కొనియాడారు.
పేదల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ(Congress Govt) లక్ష్యం అని మరోసారి నిరూపించింది అన్నారు. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేసి వర్గీకరణ కోసం ఉత్తర్వులు జారీ చేయడానికి ప్రభుత్వం చేసిన కృషి మరువలేనిదన్నారు. అలాగే రైతాంగానికి తీవ్ర నష్టం చేసిన ధరణి పోర్టల్ పూర్తిగా తొలగించి పారదర్శకంగా భూముల వివరాలను పొందుపరిచి కొత్తగా భూభారతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం శుభ పరిణామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ అంబటి లక్ష్మి, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మందుల కృష్ణమూర్తి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వేల్పుగొండ ఏలియా , కళ్లెం శ్రీనివాస్ రెడ్డి, సామ సుధాకర్ రెడ్డి, జన్ను కట్టయ్య, లింగాల నేతాజీ, లకావత్ బాలునాయక్, ఇనుముల కర్ణాకర్, వెంకట్రావు, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.