15-04-2025 01:01:45 PM
ఆదిలాబాద్,(విజయక్రాంతి): మహారాష్ట్ర నుండి అక్రమంగా దేశీదారును తీసుకువస్తున్న ఒకరిని అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ సీఐ విజయేందర్(Excise CI Vijayender) తెలిపారు. ఆదిలాబాద్ రూరల్ మండలం(Adilabad Rural Mandal) భీంసరి కి చెందిన అభిలాష్ అనే వ్యక్తి మహారాష్ట్ర లోని చెనకా నుండి అక్రమంగా తరలిస్తున్న 500 దేశీదారు బాటిల్లను, ఓ మోటార్ సైకిల్ ను మంగళవారం పట్టుకుని, అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సిబ్బంది సుధాం, తానాజీ, హనుమంతు, ధనరాజ్, శ్రీధర్ పాల్గొన్నారు.