23-08-2025 12:19:29 PM
హైదరాబాద్: జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో కోర్ కమిటీ సభ్యుల సమావేశం(Core Committee members meet) శనివారం ప్రారంభమైంది. గాంధీభవన్ లో జరిగే పీఏసీ, సలహా కమిటీలో చర్చించాల్సిన అంశాలపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు, రాష్ట్రంలో యూరియా కొరత, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించే అవకాశముంది. ఈ సమావేశం మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు పాల్గొన్నారు.