17-11-2025 07:13:10 PM
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో ఈనెల 10వ తేదీన జరిగిన కారు పేలుడు కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. జమ్ముకశ్మీర్ లో జసిర్ బిలాల్ వనిని అనే నిందితుడిని ఎన్ఐఏ బృందాలు సోమవారం అరెస్టు చేశాయి. బిలాల్ వని ఉమర్ నబీ కీలక అనుచరుడని, ఉమర్ నబీతో కలిసి ఉగ్రకుట్ర చేసినట్లు ఎన్ఐఏ బృందాలు గుర్తించాయి.
బిలాల్ వని డ్రోన్లు, రాకెట్లు తయారు చేయడంతో నిపుణుడని, కారు బాంబు తయారీకి సాంకేతిక సహకారం అందించినట్లు ఎన్ఐఏ తెలిపింది. జసిర్ వని స్వస్థలం జమ్ముకశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లా ఖాజీగండ్ వాసి అని అధికారులు వెల్లడించారు. ఢిల్లీ కారు పేలుడు కేసులో విచారణ ఎదుర్కొంటున్న అల్ ఫలా వర్సిటీ ఛైర్మన్ జావెద్ సిద్ధిఖీ సోదరుడు హమూద్ అహ్మద్ సిద్ధిఖీను మధ్యప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు. వీరికి ఢిల్లీ కారు పేలుడు కేసుతో సంబంధం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.