17-11-2025 06:24:17 PM
హైదరాబాద్: బోరబండలో హిజ్రాల మధ్య ఆందోళన జరిగింది. తప్పుడు కేసులతో వేధిస్తోందని ఓ హిజ్రాపై ఇతర హిజ్రాలు ఆరోపిచాణలు చేశారు. ఈ నేపథ్యంలో కొందరు హిజ్రాలు నిరసనగా రోడ్డుపై ఆందోళనకు దిగి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో ముగ్గురు హిజ్రాలతో పాటు బోరబండ సీఐ, పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. గాయపడిన క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.