మెడికవర్ వైద్యుల మరో విజయం
- క్యాన్సర్ బాధితురాలికి కొత్త జీవితాన్ని ప్రసాదించిన డాక్టర్లు
- రోగికి అత్యంత సక్లిష్టమైన శస్త్ర చికిత్స నిర్వహణ
హైదరాబాద్, 19 జూన్(విజయక్రాంతి) : నోటి క్యాన్సర్‌తో బాధపడుతున్న 65 ఏళ్ల కమలమ్మకు మెడికవర్ ఆసుపత్రి వైద్యులు అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి కొత్త జీవితాన్ని అం దించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన కమలమ్మకు నోటి క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో దవడ ఎముకలో ప్రభావితమైన భాగాన్ని తొలగించే శస్త్రచికిత్స అవసరమైం ది. వయస్సు, శస్త్రచికిత్సపై భయం కారణం గా ఆమె తొలుత చికిత్సకు వెనుకంజ వే శారు.
అయితే వైద్యుల సూచనలు, ధైర్యం చె ప్పడంతో చికిత్సకు అంగీకరించారు. సీనియర్ రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అజయ్ వరుణ్ రెడ్డి నేతృత్వంలో రీకన్స్ట్రక్టివ్ సర్జన్ డాక్టర్ ప్రజ్యోత్ రెడ్డి సహకారంతో శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. క్యా న్సర్ ప్రభావిత భాగాన్ని తొలగించి, కాలి భా గం నుంచి కణజాలాన్ని ఉపయోగించి నోటి నిర్మాణాన్ని పునర్నిర్మించారు.
ఈ సందర్భంగా డాక్టర్ అజయ్ వరుణ్ రెడ్డి మాట్లా డుతూ, ఆధునిక వైద్య సాంకేతికత, మల్టీడిసిప్లినరీ వైద్య బృందాల సహకారంతో వృద్ధు లకు కూడా క్లిష్టమైన క్యాన్సర్ చికిత్సలను విజయవంతంగా అందించగలుగుతున్నామ న్నారు. కమలమ్మ విజయవంతమైన చికిత్స వయస్సు లేదా భయం కారణంగా క్యాన్సర్ చికిత్సకు దూరంగా ఉండే రోగులకు ఆశాకిరణంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.






