20 June, 2026 | 2:35 AM

అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే సునీత

20-06-2026 12:00 AM

వెల్దుర్తి, జూన్ 19 : వెల్దుర్తి మండలంలో మెల్లూరు గ్రామంలో శుక్రవారం వివిధ అభివృద్ధి పనుల  ప్రారంభోత్సవ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా నర్సాపూర్ శాసన సభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. గ్రామంలో 10 లక్షలతో నిర్మించిన స్కూల్ ప్రహరీ గోడను ప్రారంభించి మొక్కలు నా టారు. అనంతరం స్కూల్లో పిల్లల  మధ్యా హ్నం భోజనం పరిశీలించి విద్యార్థులకు నా ణ్యమైన భోజనం అందుతుందా అని ఆరా తీసి స్వయంగా విద్యార్థులకు భోజనం వడ్డించారు.

అనంతరం పెద్దాపూర్ గ్రామంలోని పిట్టల వాడలో ఐదు లక్షలతో నిర్మించిన సి సి రోడ్డును ప్రారంభించి అక్కడి పిట్టల వాడ ప్రజలతో ప్రజల స్థితిగతులు వాళ్ళ జీవన విధానాలు తెలుసుకొని వాళ్లకు ప్రభుత్వం తరఫున ఇల్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తానని హామీనిచ్చారు. అనంతరం బస్వాపూర్ గ్రా మంలో జరుగుతున్న మొదటి వార్షికోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిం చడం జరిగింది.