calender_icon.png 17 August, 2025 | 12:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో‘సారీ’ నిరాశే..

24-10-2024 12:00:00 AM

హాకీలో జర్మనీపై ఓడిన భారత్

న్యూఢిల్లీ: ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 0-2 తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి పారిస్ ఒలింపిక్స్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటుందని అంతా భావించినా కానీ అలా జరగలేదు. జర్మనీ తరఫున మెర్ట్‌గెన్ (4వ నిమిషం), కెప్టెన్ లుకాస్ (30వ నిమిషం) గోల్స్ సాధించారు. సిరీస్‌లో ఆఖరి మ్యాచ్ నేడు జరగనుంది. మ్యాచ్ ఆరంభం అయిన నాలుగు నిమిషాలకే గోల్ చేసి జర్మనీ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మన ఆటగాళ్లు ఎన్ని ప్రయత్నాలు, దాడులు చేసినా కానీ జర్మనీ మాత్రం మనకు అవకాశం ఇవ్వలేదు.