calender_icon.png 17 August, 2025 | 11:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి గ్రీవెన్స్ డే కార్యక్రమం రద్దు

17-08-2025 10:24:00 AM

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా..

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): జిల్లా సమీకృత కార్యాలయ కాంప్లెక్స్ కలెక్టరేట్ లో సోమవారం నాడు 18.08.2025 నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని వర్షాలు కురుస్తున్నందున రద్దు చేస్తున్నట్లు  జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(District Collector Sandeep Kumar Jha) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు వినతులు ఇవ్వడానికి సోమవారం కలెక్టరేట్ కు రావద్దని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో అధికారులు అందరు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నందున సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి వారి సమస్యలపై దరఖాస్తులు ఇవ్వడానికి సోమవారం కలెక్టరేట్ కు రావద్దని జిల్లా కలెక్టర్ ఈ ప్రకటనలో పేర్కొన్నారు.