31 March, 2026 | 8:17 PM

మల్కాజిగిరిలో మూడో స్థానమేనా?

06-05-2024 01:00 AM

బలంగా మారిన లోకల్, నాన్ లోకల్ ఇష్యూ

కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారానికి స్పందన కరువు 

మేడ్చల్, మే 5 (విజయక్రాంతి): దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా పేరున్న మల్కాజిగిరిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా మారింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతామహేందర్‌రెడ్డికి ప్రతికూల పవనాలు వీస్తున్నట్టు కనిపిస్తున్నది. నాన్ లోకల్ ఇష్యూతోపాటు లోకల్ క్యాడర్ సపోర్ట్ లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తున్నది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ నాన్ లోకల్ అయినప్పటికీ ఆయనపై ఉన్న సానుభూతితోపాటు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటం కలిసివస్తున్నది. బీఆర్‌ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి లోకల్ అభ్య ర్థిగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. పార్లమెంట్ పరిధిలోని ఉప్పల్, ఎల్బీనగర్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్, మల్కాజిగిరి, కూకట్‌పల్లి అసెంబ్లీ సెగ్మెంట్ల లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే ఉండటం ఆయనకు కలిసివస్తున్నది. కాంగ్రెస్ అభ్యర్థి వికా రాబాద్ జిల్లావాసిగా ప్రజల్లో బలంగా నాటుకుపోయారు. సీఎం రేవంత్‌రెడ్డి సిట్టిం గ్ స్థానమైనప్పటికీ ఎంపీగా నియోజకవర్గానికి ఆయన ఏమీ చేయలేదని ప్రజలు బహి రంగంగానే చర్చించుకుంటున్నారు. 

నాయకుల మధ్య సమన్వయ లోపం 

ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన రాగిడి లక్ష్మారెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నప్పటికీ ఇటీవల బీఆర్‌ఎస్‌లో చేరి ఎంపీ టికెట్ తెచ్చుకున్నారు. దీంతో స్థానిక క్యాడర్ బీజేపీలో చేరారు. ఎల్బీనగర్‌లోనూ ఎవరికివారే అన్న చందంగా కాంగ్రెస్ నేతలు వ్యవ హరిస్తున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలైన కొలన్ హన్మంత్‌రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, సీనియర్ నేత భూపతిరెడ్డి వర్గాలవారీగా విడిపో యి ఎవరికివారే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల షాపూర్‌నగర్‌లో జరిగిన సీఎం కార్నర్ మీటింగ్‌లో అభ్యర్థి పట్నం సునీతామహేందర్‌రెడ్డి ప్రసంగిస్తూ వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్‌రెడ్డిని ప్రభాకర్‌గౌడ్‌గా పిలవడం ఆమె అవగాహనా రాహి త్యానికి నిదర్శనమని లోకల్ క్యాడర్ చర్చించుకుంటున్నారు.

కూకట్‌పల్లి నియోజకవ ర్గంలోనూ కాంగ్రెస్ పార్టీకి ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. శేరిలింగంపల్లికి చెందిన బండి రమేశ్ ఇక్కడికి వచ్చి ఆజమాయిషీ చేస్తున్నారని స్థానిక నేతలు అలకభూనినట్టు సమాచారం. మల్కాజిగిరి, కంటోన్మెంట్  నియోజకవర్గాలలో మైనంపల్లి ప్రధాన నేత గా ఉన్నప్పటికీ ప్రచారంతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. మేడ్చల్‌లో మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అస లు ప్రచారంలోనే కనిపించడం లేదు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్‌రెడ్డి మూడో స్థానానికే పరిమితం కానున్నట్టు స్థానిక నేతలు చర్చించుకుంటున్నారు.