ఆగస్టు 28 నుంచి టీఎస్ సెట్
06-05-2024 01:01 AM
హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చ రర్ నియామకాల కోసం నిర్వహించే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్ సెట్) పరీక్షలు ఆగస్టు 28 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షలు ఆగస్టు 28 నుంచి 31వ తేదీ వరకు జరగనున్నాయి. ఈనెల 14వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. జూలై 2వ తేదీలోగా దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పించారు. అపరాధ రుసుముతో జూలై 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 20 నుంచి వెబ్ సైట్ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.




