05-12-2024 01:30:32 PM
గోమాతతో కలిసి ఆదిలాబాద్ చేరుకున్న బాలకృష్ణ గురుస్వామి...
ఆదిలాబాద్, (విజయక్రాంతి): గో రక్షణ, భూ రక్షణ, పర్యావరణ రక్షణ కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేస్తున్న బాలకృష్ణ గురుస్వామి అదిలాబాద్ కు చేరుకున్నారు. 70 రోజుల తర్వాత తొమ్మిది రాష్ట్రాలు దాటి 2,300 కిలో మీటర్ల పైగా పాదయాత్ర నడిచి మహారాష్ట్ర నుండి గురువారం సౌత్ ఇండియా లోని మొదటి రాష్ట్రం, మొదటి జిల్లా అదిలాబాద్ లోని డోల్లర గ్రామం లో అడుగు పెట్టారు. మాజీ ఉప సర్పంచ్ సంతోష్ ఆధ్వర్యంలో చిన్న పుంగనూరు గోమాత కు మహిళలు, ప్రజలు మంగళ హారతులతో స్వాగతం పలికి, ఊరి చివర పొలిమేర వరకు నడిచి పాదయాత్రలో పాల్గొన్నారు. 9 రాష్ట్రాలు దాటి తమ సొంత రాష్ట్రం తెలంగాణ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని, డిసెంబర్ 6న అదిలాబాద్ లోని అయ్యప్ప స్వాములతో, గో భక్తులతోనూ వివిధ సంఘాల ప్రతినిధులతో పాదయాత్రగా వెళ్లి గోపాల క్రిష్ణ మఠంలో సమావేశం నిర్వహించనున్నట్లు బాలకృష్ణ గురుస్వామి తెలిపారు.