15 April, 2026 | 12:34 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మాదక ద్రవ్యాలపై యుద్ధం ప్రకటించాలి

18-11-2025 04:18 PM

చౌటుప్పల్,(విజయక్రాంతి): మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ  కార్యక్రమం చౌటుప్పల్ పోలీసుస్టేషన్ సిబ్బందితో కలిసి నిర్వహించిన  సిఐ మన్మథ కుమార్ డ్రగ్స్‌ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. స్నేహితులు, దగ్గరివారు ఎవరైనా మత్తుపదార్ధాలకు అలవాటు పడితె వెంటనే దూరంగా ఉండేలా కృషి చేయడం మనబాధ్యత అన్నారు. తామంతా యాంటీ డ్రగ్స్‌ మీద పోరాటం చేస్తున్నామన్నారు. మాదక ద్రవ్యాలను అరికట్టడంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు.

డ్రగ్స్‌ మాయలో పడి యువత వారి శక్తియుక్తులను వృధా చేసుకోవద్దని సూచించారు. యువత, విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు.  మాదక ద్రవ్యాలతో కలిగే చెడు పరిణామాలను గుర్తించాలని, గంజాయి, డ్రగ్స్ బారినపడి యువత జీవితాలు కోల్పోతున్నారని తెలిపారు. యువత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాకారం దిశగా పయనించాలని సూచించారు.

అంతేకాకుండా నేను మాదకద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని నేను డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ నాతోపాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను అని ప్రతి ఒక్కరితో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.